రామగుండం పోలీస్ కమిషనరేట్
తేది 09-01-2024
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
1.750 Kgs గంజాయి స్వాధీనం
నిందితుని వివరాలు:
నలిమెల వినోద్ S/o తిరుపతి, 28 సంవత్సరాలు, BC-పెరక, డ్రైవర్ R/o కుక్కల గూడూరు(v), బసంత్ నగర్, పెద్దపల్లి జిల్లా
వివరాలకు వెళ్ళితే
నేడు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామం వద్ద కు గంజాయి అక్రమ రవాణా చేయడానికి ఒక వ్యక్తి వస్తాడనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రసాద్, మరియు సిబ్బంది అనుమానస్పదంగా ఒక వ్యక్తి కనపడాగా అతన్ని తనిఖీ చేయగా 1.750 Kgs డ్రై గంజాయి లభించింది. దీని విలువ సుమారు,35,000/- రూపాయలు ఉంటుంది.
అనంతరం అతడిని విచారించగ అతని పేరు నలిమేల వినోద్ అని తెలిపి చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో ఒడిస్సా లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతానని తెలపడం జరిగింది.
నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.






