నేరాలు

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

250 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్

తేది :10-01-2024

కోడి పందాల కేసులో 09 మంది బైండోవర్

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నేపథ్యంలో చెన్నూర్ రూరల్ సర్కిల్ కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ ల పరిధిలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ విద్యాసాగర్ హెచ్చరించారు. కోడి పందాలు, జూదం వంటి వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయని అన్నారు.

వీటిపై నిఘా ఉంటుందని, చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తే సహించేదిలేదని అన్నారు. గతం లో కోడి పందెలలో నిందితులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి ముందస్తు చర్యలలో భాగంగా 09 మందిని బైండొవర్ చేయడం జరిగింది అని తెలిపారు.

సీఐ వెంట కోటపల్లి ఎస్ఐ సురేష్ ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *