నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పోటీచేసినా గెలవని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరడం విడ్డురంగా ఉంది.
సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఎద్దేవా
జనవరి 8
సిద్దిపేట జిల్లా కొమురవేల్లి అనేక పార్టీ లు మారిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇవ్వాలని తన అనుచరులతో పత్రిక ప్రకటన లు ఇప్పించుకునే స్థాయి కి దిగజారాడని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి విమర్శించారు.
సీపీఎం కొమురవేల్లి మండల సమావేశం శేట్టిపల్లి సత్తిరెడ్డి అధ్యక్షతన జరగగా జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన గెలవని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఒక నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లలో గెలవలేని కొమ్మూరి ప్రతాపరెడ్డిని భువనగిరి ఎంపీ స్థానానికి దాదాపు16 లక్షల ఓట్లు కలిగి ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న స్థానానికి ఒక్క నియోజకవర్గంలో గెలవలేని ప్రతాప్ రెడ్డి ఎంపిక ఎలా గెలుస్తారని అన్నారు.
గతంలో కూడా అనేక పార్టీల ద్వారా 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి పోటీ చేసి ఓడిపోయాడని 2014లో బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయాడని 2018లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అని 2023 లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి జిల్లా అధ్యక్షుడు గా ఉండి కూడా ఓడిపోయాడని ప్రజలు ఎన్నిసార్లు అవమానపరిచి ఓడించిన గుణపాఠం తెచ్చుకోకుండా మళ్లీ ఎంపీ కి పోటీ చేస్తానని అనడం గొంతెమ్మ కోరికలు కోరడం తప్ప మరొతి కాదని అన్నారు.
గతం లో చేర్యాల నియోజకవర్గంలో గెలిచినప్పుడు వ్యాపారాలకు ఇచ్చిన విలువ,గెలిపించిన ప్రజలకు ఇవ్వలేదని తన సొంత గ్రామం కూడా అభివృద్ధి కి ఆమడ దూరం లో ఉందని, రాజకీయంగా దిగజారిన కొమ్మూరి ప్రతాపరెడ్డి భవిష్యత్తులో ఏ ఎన్నికలకు కూడా పనికిరాడు అని అన్నారు. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల నుండి ఉపసంహరించుకొని వ్యాపారాలు చేసుకోవాలని, ప్రజాసేవకు పనికిరారని అన్నారు.
ప్రతాప్ రెడ్డి రూపాయికి కూడా పనికి రాడని వారు ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు ఉండటం ప్రజలకు అవమానకరమని కనీస విజ్ఞత లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా, రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల అవగాహన లేకుండా ఉండడం చేర్యాల ప్రాంత ప్రజల దురదృష్టకరమని అన్నారు.
ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు సిపిఎం మాత్రమే నిర్వహిస్తుందని, సిపిఎం పోరాటాలకు ప్రజలు అండదండలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు అత్తిని శారద, దాసరి ప్రశాంత్, మండల నాయకులు తేలు ఇస్తారి, తడూరి మల్లేశం ,సార్ల యాదయ్య ఆరుట్ల రవీందర్ శ్రవణచారి,భరత్, పవన్ మహేష్,రాజు తదితరులు పాల్గొన్నారు
