మంచిర్యాల బి జె పి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర లో పాల్గొన్న బీజేపీ నాయకులు
సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రెండో రోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు మంచిర్యాల జిల్లాకు చేరుకున్న నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల అసెంబ్లీ సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా SRP-3 మైన్ లో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముధోల్ ఎమ్మెల్యే రామ రావు పటేల్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి , ఎంఎల్సీ అంజిరెడ్డి పాల్గొనడం జరిగింది.
సింగరేణి సంస్థను కాంగ్రెస్ మరియు BRS ప్రభుత్వాలు తమ స్వలాభం కోసం వాడుకొని సంస్థను నిర్వీర్యం చేశారు అని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో సింగరేణి సంస్థ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది అని సింగరేణి సంస్థకు ఆర్ధిక అండగా నిలిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి బిడ్డింగ్ లేకుండా సింగరేణికి నేరుగా తాడిచెర్ల కోల్ బ్లాక్ కేటాయించి సంస్థకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది అని అన్నారు. సింగరేణి సంస్థకు బీజేపీ ఎప్పడు అండగా ఉంటుంది అని తెలిపారు.





