రామగుండం పోలీస్ కమీషనరేట్
తేది :04-01-2024
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు స్పెషల్ డ్రైవ్.
గంజాయి నిల్వ, సరఫరా, అమ్మకాల పై ప్రత్యేక నిఘా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: సీపీ రామగుండం
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చేపట్టి గంజాయి సరఫరా, నిల్వ, అమ్మకాలు చేసే వారిని పట్టుకోవడం, గంజాయి అనేది రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి రాకుండా చేస్తే చాలా వరకు కట్టడి చేసినట్లే అవుతుందని భావించి, ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటి వరకు గంజాయి స్మగ్లింగ్, రవాణా చేస్తూ పట్టుబడి జైలు నుంచి వచ్చాకా, ఇప్పుడేం చేస్తున్నారు? తదితర విషయాలను క్షేత్ర స్థాయిలో విశ్లేషణ చేస్తు ముందస్తు చర్యలలో భాగంగా బైండొవర్ చేయడం, గంజాయి వాడే అడ్డాలు, ప్రాంతాలను గుర్తించి, గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ ఇస్తు గంజాయి వాడవద్దని, దానిని ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తూ అవగాహనా కల్పించడం జరుగుతుంది.
ఈరోజు గోదావరిఖని 1 టౌన్ పరిధిలోని విఠల్, తిలక్ నగర్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిందితుల వద్ద నుండి చిన్న చిన్న ప్యాకెట్ లలో నింపిన 80 గ్రాముల డ్రై గంజాయి ని పట్టుకొని వారిని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ వారికీ అప్పగించడం జరిగింది.
