ప్రాంతీయం

అయోధ్యరాముడి పూజిత అక్షింతలు…

360 Views

ముస్తాబాద్, డిసెంబర్ 31 (24/7న్యూస్ ప్రతినిధి) అయోధ్య రామమందిరం పనులు పూర్తి కావస్తున్న తరుణంలో వచ్చే ఏడాది జనవరిలో రామ విగ్రహ ప్రతిష్ట జరగనుందని ఈసందర్భంగా ఇప్పటికే గ్రామగ్రామాన మందిరానికి సంబంధించిన అక్షింతల ఊరేగింపు చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో ఆదివారం పురవీధుల గుండా రామభక్తులు, యువకులు హాజరై సంస్కృతిక, భజన కార్యక్రమాలు, మహిళల హారతులతో దేవాలయం చేరుకుని పూజలు చేశారు. ఈ ప్రత్యేక పూజలకి గ్రామస్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యావత్ హిందూ సమాజం కలలు కన్నా రామునిగుడి నిర్మాణం పూర్తి అయిందని, వచ్చే జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని స్థాపనని పిల్లలకు మన వేదాలు, మహాభారతం, రామాయణం ఇతిహాసాలు నేర్పి శ్రీరామునిలా ఆదర్శ వంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం వాడవాడలా అక్షింతలను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *