.ఎల్లారెడ్డి పేటలోపోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్..
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పలు ద్విచక్ర వాహనాలను, ఆటోలు, కారు డ్రైవర్లను ఆపి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం డిసెంబర్ 31 రోజున రాత్రి 8 గంటల నుండి వాహనాలను అర్ధరాత్రి వరకు మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి చాలాన్లు విధించారు. ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ లో ఉంచి ఉదయం అప్పచెబుతామని అన్నారు. వారి యొక్క వివరాలు నమోదు చేసుకున్నారు మద్యం తాగి యువకులు పెద్దలు, నడిపితే చర్యలు తప్పు అని హెచ్చరించారు. ఓవర్ యాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అవసరమైతే ఆరు నెలల జైలు శిక్ష తప్పదని అన్నారు. కార్యక్రమంలో బ్లూ కోర్టు సిబ్బంది పోలీసులు భారి కేడ్లను లను రెండో బైపాస్ లో పెట్టి వాహనాలను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
