Breaking News రాజకీయం

రావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది… బిజెపి పార్టీ ఎమ్మెల్యే రుద్రమ రెడ్డి

275 Views

రావుల పాలనలో మనకేం రావు
తెలంగాణలో బీజేపీ రాబోతోంది..
సిరిసిల్లలో బీజేపీ బారీ మెజార్టీ
సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ
కేసీఆర్ రావుల పాలనలో మనకేం రావు అని ప్రజలకు అర్థమైందని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. మంగళవారం ఆమె గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి, ముచ్చర్ల,రాజుపేట గ్రామాలలో పర్యటించారు. ఇంటింటా తిరిగి ఓట్లు అడిగారు. బారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హామి ఇచ్చిన హామీలేవీ అమలుకాలేవన్నారు. దళిత సీఎం ను చేయలేదన్నారు. దళితులకు మూడేకరాల భూమి ఇవ్వలేదన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదన్నారు. కొత్తపెన్షన్లు,కొత్త రేషన్లు కార్డులు పేదలకు అందలేదన్నారు. రావుల పెత్తనంలో ప్రజలకు ఏమీ రావన్నారు. ఒక్కటి వచ్చాయన్నారు. ఊరూరా బెల్ట్ షాపులు వచ్చాయన్నారు. బెల్ట్ షాపుల ద్వారా వచ్చే రాబడితో ప్రభుత్వాన్ని కేసీఆర్ నడుపుతున్నారన్నారు.కేసీఆర్ సంపాదన కోసం పేదల సంసారాలు నాశనం చేస్తున్నరన్నారు. బీజేపీ పాలన ప్రజాదక్షత గల పాలన అన్నారు. మోడీ పాలనలో దేశం పురోగమిస్తోందన్నారు. మోడీ నాయకత్వాన్ని దేశం అంతా బలపరుస్తోందన్నారు. కేటీఆర్ ను గద్దె దించి సిరిసిల్లలో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. మోడీ పాలన తెలంగాణలో రావాల్సిన అవసరం ఉందన్నారు. గంబీరావుపేట మండలంలో ఆమె పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ లు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఆ సారి తెలంగాణలో బీజేపీ పాలన ఏర్పడబోతోందన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *