ఆర్థిక సహాయం
మెదక్ జిల్లా డిసెంబర్ 31
మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టాపూర్ లో రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై మరణించిన ఆగం బూదవ్వ కుటుంబానికి,, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం చిట్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు మంతురి బాబు, రెడ్డి బాల నరసింహులు, గాజుల రమేష్, సర్వే నర్సాగౌడ్, రెడ్డి రవి, సిద్ధిని భాస్కర్, సిద్ధిని రాజు, సిద్ధిని స్వామి, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
ఇట్టి పరామర్శ కార్యక్రమంలో గ్రామ నాయకులు మాట్లాడుతూ త్వరలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు రావడానికి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పక్కా ఇల్లు నిర్మాణానికి మా వంతు సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేశారు ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆసరాగా నిలిచిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీకి ఆపత్కాలంలో ఉన్న కుటుంబాన్ని మంచి మనసుతో పెద్దలు దృష్టికి తీసుకెళ్లి సాయం చేసిన కుటుంబ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు





