కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను నెలరోజుల లోపే అమలు చేశామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్రెడ్డి అన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడు విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండానే బిఆర్ఎస్ మందబలంతో మున్సిపాలిటీలో కలిపారని తిరిగి ఇప్పుడు మళ్లీ ప్రత్యేక గ్రామపంచాయతీ చేస్తామని తీర్మానాలు చేయడం వాళ్లకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని,అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్నారని,అన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే అనేక రకాలుగా మాట్లాడారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు గ్యారెంటీలలో 30 రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తే అభినందించాల్సింది పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని,తెలిపారు
కేటీఆర్ స్థానిక సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అయి ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా పాల్గొనలేరని, ప్రజా క్షేత్రంలోకి వెళ్తే ప్రజలు కేటీఆర్ నిలదీస్తారని భయంతో ఉన్నాడని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు గడ్డం నరసయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, వైద్య శివప్రసాద్ ,గొనెఎల్లప్ప, మ్యాన ప్రసాద్ ,జలగం ప్రవీణ్, మహమ్మద్ ముస్తఫా, ఎల్లే లక్ష్మీనారాయణ, దూబాల వెంకటేశం, స్వర్గం రాజు, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
