ప్రజా పాలనలో భాగంగా నేడు దండేపల్లి లో ప్రజా పాలనలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల పథకం ఈనెల 28న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలంలో నేడు జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తు స్వీకరణ ఎలా జరుగుతుందో మరియు ప్రజా పాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో దండేపల్లి మండలంలోని వివిధ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు.
