అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాజకీయ ప్రజా యుద్ధం తప్పదని దళిత బహుజన పార్టీ డి బి పి జాతీయ అధ్యక్షులు. వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు.
నేడు పార్టీ కేంద్ర కార్యాలయం లో జరిగిన మీడియా
సమావేశం లో మాట్లాడుతూ,కెసిఆర్ సర్కార్ అనుసరించిన నియంత్రత్య పాలన పైన తెలంగాణ ప్రజలు విసిగించి తిరుగుబాటు చేసారని, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఆదరించారాని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసికోవాలన్నారు.
ప్రస్తుతం తెలంగాణ లో దొరల పాలన పోయిన పటేల్ రెడ్డి రాజ్యం వచ్చిoదన్నారు. దళిత బహుజన రాజ్యాంగపు హక్కులకు భంగం వాటిళ్ళితే దళితుల తిరుగుబాటు తప్పదన్నారు. కాంగ్రెస్ పాలన లో టీఎస్పీఎస్సీ పాలక మండలి ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
కెసిఆర్ పాలన లో దారి మళ్ళిన ఎస్సీ,ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ నిధులు మూడు లక్షల కోట్ల రూపాయల నిధులను తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల ప్రభుత్వం భూములను రియల్ ఎస్టేట్ కార్పొరేట్ దోపిడీ వర్గం నుండి కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. దళితుల పైన దాడులు చేసిన వారిని కఠినo గా శిక్షించాలని. ఎస్సీ. ఎస్టీ చట్టం ను పటిష్టంగా అమలు చేయాలని నూతన రాష్ట్ర హోమ్ మంత్రి కి విజ్ఞప్తి చేసారు.
ఈ సమావేశం లో పార్టీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ దాసరి భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్, మహిళా నగర అధ్యక్షురాలు బండారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
