Breaking News

ఘనంగా 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

214 Views

వర్గల్ మండల్ డిసెంబర్ 28:పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యం.

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి.

పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యపడుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి పేర్కొన్నారు . గురువారం మల్లారెడ్డిపల్లిలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవo పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నేత అనీల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు .

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండగా , పేద బడుగు , బలహీన వర్గాల లో వెలుగులు నింపడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు . ఇప్పటికే రెండు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ అమలు చేయగా , ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం , ఆరోగ్య శ్రీ రూ 10 లక్షలకు పెంపు వంటి పథకాల అమలుతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నట్టు చెప్పారు . ఈ కార్యక్రమంలో వర్గల్ ఉప సర్పంచ్ రమేష్ ముదిరాజ్ , నాయకులు యాదగిరి, పిట్ల రాజు , మల్లారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , మహబూబ్ , అజీజ్ , సల్మాన్ , కృష్ణ , నందకుమార్ , మధుసూదన్ రెడ్డి , మహేష్ , వెంకటేష్ , శ్రీహరి తదితరులు పాల్గొన్నారు .

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *