(తిమ్మాపూర్ డిసెంబర్ 28)
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామక్రిష్ణకాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పొలం మల్లేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణి చేశారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
భారత దేశ స్వాతంత్రం కోసం పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారని, గాంధీ నెహ్రూ నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహించి ఆంగ్లేలను తరము కొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. దేశంలో 49 ఏళ్ల అధికారంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందించిందని ప్రజలకు వివరించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకుంటుండగా తల్లుల కడుపుకోతను చూడలేక తల్లి సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. వచ్చిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనుడు కెసిఆర్ అని విమర్శించారు.
రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, తల్లి సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు.
గురువారం నుంచి జనవరి 6 వరకు గ్రామాలలో ప్రజల వద్దకే ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించి అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు…..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల అంజయ్య గౌడ్, కొమ్మెర మల్లారెడ్డి,కొండల్ రావు,కొత్త తిరుపతి రెడ్డి, కొత్త రాజిరెడ్డి, బుధరాపు శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు..