వర్గల్ మండల్ డిసెంబర్ 27:ప్రజల మేలుకోసమే ప్రజా పాలన కార్యక్రమం.
-కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, మహా లక్ష్మీ తదితర ప్రభుత్వ 6గ్యారంటీ ల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం.
దరఖాస్తు కు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా జత పరచాలి
ఒక్కో గ్రామంలో 100కుటుంబాలకు కౌంటర్ ఏర్పాట్లు చేస్తాం
గరిష్టంగా ఒక్కో గ్రామం లో 5కౌంటర్ లు ఉంటాయి.
6గ్యారంటీ లతో పాటు, ఇతర భూ సంబంధ సమస్య లకోసం ప్రత్యేక కౌంటర్ ఉంటది.
ఆయా గ్రామాలలో సమయం గడువు దాటినా వచ్చే నెల 6వరకు పంచాయితీ కార్యదర్శులకు దరఖాస్తు లు ఇవ్వవొచ్చు…..
స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించడం జరిగింది.