(తిమ్మాపూర్ డిసెంబర్ 09)
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ
ప్రజల గుండెల్లో నిలిచిందని,అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం
తీర్చుకున్నారని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పొలం మల్లేష్ యాదవ్ అన్నారు.. శనివారం సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో ముఖ్య అతిధిగా హాజరై కేక్ కట్ చేశారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోనియాగాంధీ జన్మదినం రోజునే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా 10 లక్షల రూపాయల వైద్య సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని,
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజామోద్యమైన జనరంజక పాలన తెలంగాణలో కొనసాగుతుందన్నారు అవినీతి అక్రమాలకు తావులేకుండా ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ప్రజల దీవెనలతో తల్లి సోనియమ్మ నిండు నూరేళ్లుఆయురారోగ్యాలతో విరాజిల్లుతుందని ఆయన
ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు మాచర్ల అంజయ్య గౌడ్,కొమ్మేర మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టి కార్యకర్తలు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..