ఎ.ఐ.ఎస్.బి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పుల్లని వేణు నియామకం
డిసెంబర్ 24
హైదరాబాద్ బిట్స్ పీలాని క్యాంపస్ ప్రాంతంలో డిసెంబర్ 22వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏఐఎస్బి రాష్ట్ర ఇంచార్జ్ గొల్లపల్లి రాజు నియామకం చేశారు. సిద్దిపేట జిల్లా, చేర్యాలకు చెందిన పుల్లని వేణు ని జిల్లా అధ్యక్షుడి పదవి నుంచి తన ఉద్యమ సేవలను, పార్టీ పట్ల నిబద్దత, విద్యార్థి & విద్యారంగా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నందుకు గాను గుర్తించి ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ. నా నియామకానికి కృషి చేసిన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి కి మరియు రాష్ట్ర ఇంచార్జ్ కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, ఏఐఎఫ్బి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అందె బీరన్న లకు , తోటి విద్యార్ధి నాయకులకు, పత్రిక సోదరులకు, విద్యాసంస్థల యాజమాన్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా భవిష్యత్ లో జిల్లా తో పాటు రాష్ట్రంలో వున్నా హాస్టల్స్, డేస్కాలర్ విద్యార్థుల సమస్యలపై పోరాడుతానని వారు అన్నారు.





