(తిమ్మాపూర్ డిసెంబర్ 24)
తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మ దహనం చేసినారు….
నిన్న కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే, దానికి ప్రతిచర్యగా ఈరోజు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు…
తిమ్మాపూర్ బస్ స్టాప్ వద్ద ధర్నా ముగిసిన తర్వాత పోలీసు వారు బందోబస్తులో ఉన్నారని తెలిసి పోలీసు వారికి తెలియకుండా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సుభాష్ నగర్ స్టేజ్ వద్దకు చేరుకొని దిష్టిబొమ్మ దహనం చేశారు..
తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ సుభాష్ నగర్ స్టేజి వద్దకు చేరుకుని, కవ్వంపల్లి డాం డాం ఖబర్దార్ కవ్వంపల్లి అంటూ నినాదాలతో హోరెత్తించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గాని, రసమయి బాలకిషన్ మీద గాని వ్యక్తి గత విమర్శలు చేస్తే తిమ్మాపూర్ మండల ప్రక్షాన ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..
మీరు గౌరవంగా మాట్లాడితే మేము కూడా గౌరవంగా మాట్లాడుతామని అన్నారు. మీ మాట,పద్ధతి మార్చుకుంటే మా పద్ధతి మార్చుకుంటామని ఘాటుగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు..




