24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 24)
గజ్వేల్ : విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన జగదేవపూర్ మండల పరిధిలోని అంతాయ గూడెం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గాండ్ల రమేష్ తండ్రి మల్లయ్య ఎద్దు ఆదివారం ఉదయం లేచి పొలం వద్దకు వెళ్లేసరికి ట్రాన్స్ ఫార్మర్ వద్ద తన ఎద్దు చనిపోయి ఉంది. కరెంట్ తీగలు కిందికి ఉండడం వల్ల కరెంట్ షాక్ తో ఎద్దు మరణించినట్లు రైతు రమేష్ తెలిపాడు.ఎద్దు చనిపోవడంతో రైతు భోరున విలపించాడు.
సుమారు ఎద్దు విలువ రూ. 1లక్ష వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గండ్ల రమేష్ ది నిరుపేద కుటుంబమని తనను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ ,విద్యుత్ శాఖ ,అధికారులకు పోలీసు, అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
