24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 22)
బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అక్రమ అరెస్టును కండిస్తున్నామని అతన్ని బేషరత్ గ విడుదల చేయాలనీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
పల్లవి ప్రశాంత్ అరెస్టును నిరసిస్తూ అతని బేషరత్ గ విడుదల చేయాలనీ సిద్దిపేటలో బి.ఆర్. అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సీజన్లో కానీ అల్లర్లు తెలంగాణ రైతు బిడ్డడు పల్లవి ప్రశాంత్ విన్నర్ గ నిలిచినప్పుడే జరుగాల ఇదంతా చూస్తుంటే కక్షపురితమే నని అనిపిస్తుందని పల్లవి ప్రశాంత్ నిరుపేద ముదిరాజ్ కుటుంబంలో పుట్టడమే పాపమా బలహీన వర్గాలలో తెలివి పరులు ముందుకు రాకూడదా అని అన్నారు.
ప్రశాంత్ పైన పెట్టిన కేసులు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయలని లేని పక్షంలో ముదిరాజులంతా ఏకమై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పడిగె ప్రశాంత్, సుతారి రాజు, పుల్లూర్ సుధాకర్, కండ్లకోయ బాలకృష్ణ, కోరబోయిన సుధాకర్, బోనాల శ్రీనివాస్, తుమ్మల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
