-సుగుర్తి జగదీశ్వరాచారి
(తిమ్మాపూర్ డిసెంబర్ 21)
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అర్థమయ్యేలా వివరించేందుకు అధికారులు కృషి చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బిజెపి అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేత్రుత్వం లోని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ రకాల పథకాలను వివరించేందుకు వికసిత భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం తిమ్మాపూర్ మండలంలోని రామక్రిష్ణకాలనీ లో గురువారం జరిగింది.
ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ తో రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు అందిస్తున్న పథకాలపై వివరించారు.5 లక్షల ఉచిత వైద్య సేవలకు సంబందించిన అభా కార్డు ను అర్హులైన వారందరూ సిఎస్సి కేంద్రాల ద్వారా పొందాలని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిఓ కిరణ్, వైద్యాధికారులు ప్రణవ్,జువేరియా,ఐసిడిఎస్ పర్యవేక్షకులు శ్రీలత, లీడ్ బ్యాంకు మేనేజర్, ఏఈఓ స్వామి,పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య,వార్డు సభ్యులు అలువాల సంపత్,మాచర్ల అనిల్, తుర్పాటి అజయ్,గ్రామంలో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.