(బెజ్జంకి డిసెంబర్ 18)
బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో వాణినికేతన్ డిగ్రీ కాలేజ్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది..
ఈ ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు..
బస్సు అతివేగమే ఈ ప్రమాదనికి కారణం, డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు తెలిపారు. గాయపడ్డ విద్యార్థినిలను బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..