24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మలో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ను నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ ఈరోజు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, నాయకులు శామీర్పేట్ హన్మంత రావు, విష్ణు వర్ధన్ రెడ్డి, ఎంబరి ఆంజనేయులు, మల్లేష్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





