వరి నారును పరిశీలించిన వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి
డిసెంబర్ 19
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం బండపోతుగల్ గ్రామం లో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి నారుమడులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు చల్లగా ఉన్నాయి కావున రైతులు నారుమడులల్లో నీటిని ఎప్పటికప్పుడు తిసివెస్తు జాగ్రత్తగా వ్యవహించాల్సి ఉంటుందని, అదేవిధంగా వరి నారుమడి ఎర్రగా మారుతున్నట్లు గమనిస్తే ఫార్ములా 4 ను లీటరు కు 2 గ్రా. కలిపి పిచికారి చేసుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు రైతుబంధు కొరకు ధరకాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భూపాల్ మరియు బండపోతుగల్ సర్పంచ్ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
