దోమలను అరికడదాం
ఆరోగ్య సమాజానికి పునాది వేద్దాం!
గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్ నందు ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యక్రమంలో మురికి కాల్వలను శుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దోమల నివారణకై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దోమల వల్ల అనేక రకమైన వ్యాధులు సంక్రమిస్తాయని ఫైలేరియా మలేరియా . డెంగు .చికెన్ గునియా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయని మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలని మన ఇంటి పరిసరాలలో నీటి నిలువ కుళాయిలను .కొబ్బరి చిప్పలను .తొట్టిలను. ఎయిర్ కూలర్స్ లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ముఖ్యంగా మనము నిద్రిస్తున్న సమయంలో మచ్చర్దానులను. ఆల్ అవుట్లను ఓడమాసు లాంటి క్రిములను వాడి దోమల నుండి రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ డాక్టర్ సంధ్య అరుణ స్టాఫ్ నర్స్ సుగంధ దివ్య రష్మీ అరుణ హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్ .జోసఫ్ పాండు ల్యాబ్ టెక్నీషియన్s ఆశ వర్కర్లు నవిత మంజుల రమ రాజు మరియు పారామెడికల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
