24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17)
కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులు ఆందోళన
ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గత రెండు మూడు గంటలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉచిత ప్రయాణం పేరిట తెలంగాణ ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గించిందని వారు ఆరోపణ చేశారు.
అధికారులు వెంటనే స్పందించి తమకు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.
