రాజకీయం

వెంటనే సస్పెండ్ చేయాలి…

1,012 Views

(కరీంనగర్ డిసెంబర్ 15)

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పై వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ డిమాండ్ చేశారు..

కరీంనగర్లో బిజెపి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సీనియర్ నాయకులను వ్యతిరేకంగా మీటింగులు పెట్టుకొని పార్టీని బ్రష్టు పట్టిస్తున్నటువంటి నాయకులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. గల్లీ నుండి ఢిల్లీ దాకా పార్టీని బలోపేతం చేసినటువంటి బండి సంజయ్ గురించి మీటింగ్లు పెట్టడం సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కుటుంబానికి దూరంగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తే కొంత మంది నాయకులు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని తొలగించాలని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తేనే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తీసివేయడం జరిగిందని,ఆ పరిస్థితి మనమందరం చూస్తున్నామని అన్నారు .బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉండేదని అన్నారు..

ఇప్పటికైనా సీనియర్ నాయకులు బండి సంజయ్ అడుగుజాడల్లో నడిస్తే తప్ప మీకు పుట్టగతులు ఉండవని,సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారంటే అది మీ వల్లనే అని అర్థమవుతుంది. బండి సంజయ్ ని ఓడగొట్టడానికి కూడా ఇలాంటి రహస్య మీటింగ్లు పెట్టుకొని బండి సంజయ్ ని ఓడించాలని నిర్ణయించుకున్న సంగతి ఈ రహస్య మీటింగ్ ల ద్వారా ప్రజలకు తెలుస్తుందన్నారు..

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి తప్ప సిట్టింగ్ ఎంపి గా ఉన్నటువంటి బండి సంజయ్ ని కాదని కరీంనగర్ లో ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇవ్వరని,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు… మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బండి సంజయ్ గెలుపు ఆగదని, కేంద్రంలో నరేంద్ర మోడీ మళ్లీ అధికారం చేపడతారని, కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీగా గెలిసి కేంద్ర మంత్రిగా అవుతారని ధీమా వ్యక్తం చేశారు…..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *