రాజకీయం

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం

260 Views

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం

పార్టీ నేతలకు కెటిఆర్ సూచన

డిసెంబర్ 14

హైదరాబాద్:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు, ఆ పార్టీ నేతలతో నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు.

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయకత్వంపై సానుకూల స్పంద న వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను నిర్వహిస్తామని వెల్లడిం చారు.

నాడు అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో, నేడు ఓడిన తర్వాత కూడా అంతే బాధ్యతగా ఉంటామని కెటిఆర్ తెలిపారు.

ఈ ఎదురుదెబ్బను పాఠంగా నేర్చుకొని, ఓటమికి గల కారణాలను లోతుగా.విశ్లేషించుకుంటామని తెలిపారు.అదేవిధంగా ఈ ఫలితాలపై నేతలు, కార్య కర్తలు ఎటువంటి నిరాశ పడొద్దని, ఇది పార్టీకి తాత్కాలికి బ్రేక్ మాత్ర మేనని ధైర్యం చెప్పారు.ఈ అయిదేళ్లలో 100 శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలియజేశారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *