కొల్లాపూర్ డిసెంబర్ 13 :గెలిచిన పది రోజులకే కొల్లాపూర్ లో అభివృద్ధిని మొదలుపెట్టిన మంత్రి జూపల్లి.
ఎత్తం గ్రామంలో గ్రామ పంచాయితీ భవనం,అంగన్వాడి భవనం మరియు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.
కోడెర్ మండలం ఎత్తం గ్రామంలో గ్రామ సర్పంచ్ సాయిని వరలక్ష్మి మరియు గ్రామ ఎంపీటీసీ సాయిని శ్రీనివాస్ రావు అధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాక మంత్రి వర్యులు శ్రీ.జూపల్లి కృష్ణారావు నూతన గ్రామ పంచాయితీ భవనం,గ్రామ నూతన అంగన్వాడి భవనం మరియు డా.భీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ అభివృద్ది పరంగా మీ గ్రామానికి అన్ని విధాలుగా సహకరిస్తానని అసెంబ్లీ సమావేశాల తర్వాత గ్రామంలోని పేద ప్రజలకు గతంలో మీరు కోరుకున్నట్లుగా ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొడేర్ మండల మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు , సింగిల్ విండో డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి ,నక్క వేణు గోపాల్ యాదవ్ ,ఇతర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.