రాజకీయం

అయ్యప్ప స్వామి మహా పడి పూజకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

212 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 13)

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శివాలయం వద్ద నిజాంపేట్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజా మహోత్సవానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి కృప అందరిపై ఎల్లప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *