Breaking News

పాక్షిక సూర్యగ్రహణం..గ్రహణ శాంతులు

161 Views

25 అక్టోబర్ 2022 దీపావళి అమావాస్య నాడు కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం 2వ పాదం తులారాశిలో ఏర్పడుతుంది.ఈ గ్రహణం సాయంత్రం 5.03ని.లకు ప్రారంభమై 6.32 కు విడుస్తుంది. పట్టుడు స్నానం చేసేవారు సాయంత్రం 4గంటలకు స్నానం చేయాలి.గ్రహణానంతరం విడుపు స్నానం చేయాలి.ఈ గ్రహణకాలంలో మంత్రోపదేశం తీసుకున్నవారు,ఇష్టదేవతా ప్రార్థన చేయాలకున్నవారు మంత్రజపం,ఇష్టదేవతా ప్రార్థన చేసుకోవచ్చు.గ్రహణం నాడు ఉదయం 11వరకు భోజనాలు పూర్తి చేయాలి.పిల్లలు,వృధ్ధులు,రోగులు మధ్యాహ్నం 2.30లోపల భోజనాలు చేయాలి.ఎట్టి పరిస్థితిలో మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 6.32లోపల ఆహారం తినడం,నీళ్ళు త్రాగడం నిషిధ్ధం.సాయంత్రం 6.32తర్వాత గృహశుధ్ధి చేసుకొని పూజలు చేసుకొని వంటలు సిధ్ధం చేసుకొని తినవచ్చు.గ్రహణం తెల్లారి గ్రహణ శూల ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేయరాదు.ఉద్యోగులకు ఇది వర్తించదు.గ్రహణ సమయంలో నిద్రించరాదు,ప్రయాణాలు చేయరాదు.గర్భిణీ స్ర్తీలు గ్రహణాన్ని చూడరాదు.గ్రహణ కాలానికి ముందే ఇంట్లోని ఆహార పదార్థాలపై ధర్భలు అనగా పచ్చి గడ్డిపోచలు ఉంచాలి.గ్రహణం తర్వాత ఆ ధర్భలను తీసివేయాలి.ఈ పాక్షిక సూర్యగ్రహణం వలన అఖండ రాజయోగం కలుగబోతున్నరాశులు… సింహం,ధనుస్సు,వృషభం,మకరం.మధ్యమ ఫలితాలు పొందబోతున్న రాశులు…కన్య,మిథునం,కుంభం,మేషం అధమ ఫలితాలు పొందబోతున్న రాశులు…తుల,కర్కాటకం,మీనం,వృశ్చికం.గ్రహణ శాంతులు….స్వాతి నక్షత్రం తులారాశివారు సువర్ణంబింబం,వెండి పడగ చేయించివాటిని నెయ్యితో కూడిన కంచుపాత్ర ఉంచి కిలోంపావు గోదుమలు,కిలోంపావు ఉలవలు ఎర్రని వస్ర్తంలో కట్టి పండితులకు లేదా అర్చకులకు దానం చేయాలి

అయ్యప్పస్వామి దీక్షలో ఉన్నటువంటి అయ్యప్పలు మీ సన్నిధానాల్లో ఉదయం 11 గంటల లోపు పీఠం పై దర్భ వేసి ఉంచవలెను.

గ్రహణం కారణంగా 25 వ తేదీ మంగళవారం
మధ్యాహ్నం బిక్ష 11: 00గం”లలోపు ముగించుకుని సాయత్రం 4.30 గంటలకు పట్టుస్నానం ఆచరించి స్వామివారి నామస్మరణ జపం ఆచరించవలయును

05: 43 ని”ల తరువాత పునః మరల స్నానమాచరించి
సన్నిధానం శుద్దిచేసుకుని స్వామివారి పీఠం పటం శుద్ది చేసుకొని

పూజలు ముగిన్చుకొని రాత్రి 8.00 తరువాత అల్పాహారం తయారు చేసుకుని స్వామివారికి నివేదించి భుజించవలెను

No Slide Found In Slider.

Poll not found