(తిమ్మాపూర్ సెప్టెంబర్ 24)
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన తాళ్లపల్లి ఎల్లవ్వ కుటుంబాన్ని మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్‌గౌడ్ ఆదివారం పరామర్శించి,మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని అనిల్‌గౌడ్ అ కుటుంబనికి హామీ ఇచ్చారు.వారి కుటుంబానికీ తనవంతు సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.
అనిల్ గౌడ్ వెంట నాయకులు తదితరులు ఉన్నారు. అక్కపల్లి కొమురయ్య, బౌత్ గంగాధర్, గుర్రం జగదీష్, కామెర సంపత్, కొలిపాక రాజయ్య,ఉప్పులేటి తిరుపతి, తాల్లపల్లి బూమలింగ్, సానగొండ నరసింహస్వామి, బోయిని శ్రీకాంత్, పరునంది జగదీశ్ , అసోద అనీల్, అసోధ బాలయ్య, సమ్మయ్య తదితులు పాల్గొన్నారు.




