ఆధ్యాత్మికం

భగవంతుడికి ఇష్టమైన పువ్వులు ( శివుడు)

425 Views

*భగవంతునికి  ఇష్టమైన పూలు*
➖➖➖✍️

*”అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః*
*సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః*
*జ్ఞాన  పుష్పం  తపః పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ*
*సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్”*

*1. అహింసాపుష్పం: *
*ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ‘ప్రధమ పుష్పం.’*

*2. ఇంద్రియ నిగ్రహం: *
*చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం!’*

*3.  దయ: *
*కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.  ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.*

*4.  క్షమ: *
*ఎవరైనా మనకి అపకారం చేసినా,  ఓర్పుతో సహించడమే క్షమ.  ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.*

*5. ధ్యానం: *
*ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవుని అందించే ఐదవ పుష్పం!*

*6. తపస్సు: *
*మానసిక ( మనస్సు), వాచిక (మాట), కాయక ( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.  ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.*

*7. జ్ఞానం: *
*పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.  ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.*

*8.సత్యం: *
*ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.  ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.*

*ఇవన్నీ చాలా అరుదైన పుష్పాలే, అవన్నీ మీ తోటలో లేవంటారా.  మరేం పరవా లేదు, ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి. *✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
????????????

????లోకా సమస్తా సుఖినోభవన్తు!????

????????????????????????????????????????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *