మంచిర్యాల జిల్లా
రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు నుండి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు తెలంగాణలో ఎక్కడినుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలివే!
-పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపు
-తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తింపు
-స్థానికత ధ్రవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి
-కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు.
-ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది.
-అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తింపు.
“కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శనివారం (తేది:09.12.2023) నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే దాదాపు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లతో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు వర్చువల్ గా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను వారికి వివరించాం.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ గారు తెలిపారు.
