రాజకీయం

నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కవిత

286 Views

24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 20)

నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కవిత. నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలియతిగారు. ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక దీపోత్సంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీక మాసానికి, నీలకంఠేశ్వర స్వామివారికి తమకు ఎంతో అనుబంధం ఉందని, చాలా ఏళ్ళ నుంచి కార్తీక పౌర్ణమినాడు ఈ ఆలయానికి వస్తుంటామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *