రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు.
కొల్లాపూర్ డిసెంబర్ 7
హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈసందర్బంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది.
