Breaking News

*ఈనెల 28 వ తేదీ రోజున వాహనాల వేలం*

154 Views

జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే *

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలలో రోడ్లపై వదిలేవేయబడిన/ గుర్తుతెలియని వాహనాలను ఈనెల తేదీ 28-10-2022 రోజున ఉదయం సమయం 10:00 గంటలకు జిల్లా పరిధిలోని తాడూర్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న 72 వాహనాలను సంబంధిత యజమానులు తీసుకెళ్లాలని, ఆరు నెలల్లోగా తీసుకోకపోతే వేలం వేస్తామని ఏప్రిల్ నెలలో ప్రకటన ఇచ్చాము అవి ఇప్పటి వరకు వాహనాలను తీసుకెళ్లేందుకు రాకపోవడంతో మొత్తం వివిధ రకాల 72 వాహనాలలో 69 వాహనాలు స్క్రాప్ దశలో మరియు 3 వాహనాలు కండిషన్ దశలో ఉన్నాయని ఈ వాహనాలను తాడూర్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈనెల తేదీ 28 వ తేదీ రోజున వేలం వేయనున్నట్లు ప్రకటించారు. వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సహా హాజరుకావాలన్నారు.వేలంపాటలో పాల్గునే వారు ఇతర వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
ఆర్.ఐ (MTO)::9440394460

No Slide Found In Slider.

Poll not found