రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం కొండాపురం గ్రామంలో సోమవారం ఉదయం భారీ ఎత్తున అభ్యర్థి పాల్వాయి స్రవంతి తో మహిళలు ఊరేగింపు తీశారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి డప్పు వాయిస్తూ గ్రామస్తులను అలరించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులైన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నాయకులు కొత్తపల్లి దేవయ్య చిన్ని బాబు గూడ విజయ్ రెడ్డి గుండాటి రామ్ రెడ్డి బానోతు రాజు నాయక్ ఎండి షకిల్ పాల్గొన్నారు
