Breaking News

ఇంటింటా ప్రచారం

287 Views
  • మర్కుక్ మండలం,పాములపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటా ప్రచారం

ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష మెజారిటీ ఖాయం

మర్కుక్ మండల్ ఎంపీపీ పాండుగౌడ్

నవంబర్ 25

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి,కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరింత అభివృద్ధి మరిన్ని కొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తాడని,కేవలం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించారు.రైతుబంధు,రైతు బీమా,కల్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్,దళిత బంధు,బీసీ బంధులాంటి అనేక సంక్షేమ పథకాలు చూసి గ్రామంలోని ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ ఎంపీపీ పాండు గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య, నరేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,యూత్ అధ్యక్షుడు మురళి, సీనియర్ నాయకు డు తాడూరి స్వామి గౌడ్, మధుసుదన్,చిలువేరి శ్రీనివాస్ గౌడ్, సుధాకర్, రాములు,లక్ష్మణ్, దుర్గాప్రసాద్, చెక్కలి నర్సింలు,గణేష్,కర్ణాకర్, చినబోయిని మల్లేష్,రామస్వామి, ఎడెల్లి మల్లేష్, కార్యకర్తలు, ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *