ఆధ్యాత్మికం

ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు…..

288 Views

(తిమ్మాపూర్ డిసెంబర్ 06 ది)

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పారునంది జలపతి మాట్లాడుతూ..

సమాజంలోని ఉన్నత వర్గ ప్రజలు,అణగారిన వర్గాల ప్రజలపై తీవ్రమైన దారుణాలకు,దోపిడికి పాల్పడుతున్న సమయంలో భారతదేశంలో జన్మించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల కొరకు గొప్ప గొప్ప చదువులు చదువుకొని వారి బాగు కోసం నిరంతరం వారి యొక్క హక్కుల కోసం దళిత ఉద్యమాన్ని ప్రేరేపించడమే కాకుండా అంటరానితనం(దళితుల) రూపుమాపడానికి అనునిత్యం కృషి చేసిన గొప్ప మహనీయుడు అని అన్నారు. అంతేకాకుండా దేశంలో మహిళలు,కార్మిక హక్కులకు మద్దతు ఇవ్వడంతోపాటు స్వతంత్ర భారతదేశనికి రాజ్యాంగం రూపొందించిన వాస్తు శిల్పి అని కొనియాడారు.దేశంలో హక్కుల పోరాటంలో అనునిత్యం కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మాతంగి లక్ష్మణ్,కనకం రాములు,బోర్ర రవన్న,కన్నం లక్ష్మణ్,కన్నం నర్సయ్య,కోయడ మురళి,అల్వాల శంకర్,కవ్వంపల్లి అంజి, కవ్వంపల్లి పద్మ,కుంభాల లత,సంగుపట్ల మల్లేశం,గూడ కమలాకర్,రాచపల్లి ప్రసాద్,అశోక్,తూర్పాటి అజయ్,రోడ్డ రమేష్,కిన్నెర అంజి,అసంపల్లి అశోక్,తాటిపల్లి బాబు,సంపత్,అల్వాల సంపత్,ఇనుకొండ సంపత్, బామండ్ల మల్లేశం, అల్వాల అనీల్, చందు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *