24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6)
గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ కొత్తపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈసంపెల్లి ఐలయ్య ఇంటిని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేయడంతో బాధిత కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





