ఆదిలాబాద్ జిల్లా.
ఫిబ్రవరి 3 నుండి 10 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ.
తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ మొదలైంది. ఈ యొక్క స్వీకరణ ఫిబ్రవరి 3 నుండి 10 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్సి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులు, నోడల్ అధికారుల తో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నామినేషన్ వేసే సందర్భంలో సమావేశాలు, ర్యాలీలుగా ఊరేగింపుగా వెళ్లే అభ్యర్థులు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు.
