మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు.
ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతానని ఎమ్మెల్యేగా గెలుచిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. తాను అందరికి అందుబాటులో ఉంటానని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలుపంచిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంద్రవెళ్లి సభ అనంతరం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గలలో కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు.






