Breaking News

విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి.*

166 Views

*విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి.*

దూలిమిట్ట.. చేర్యాల కొమురవెల్లి మద్దూరు దూలిమిట్ట మండలాలను కలుపుతు, చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్ రెండో తేదీన జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని చేర్యాల నియోజకవర్గ జేఏసీ నాయకులు గద్దల మహేందర్ మరియు చేట్కూరి కమలాకర్ మండల కన్వీనర్ సుందరగిరి భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా దూల్మిట్ట మండల కేంద్రంలో బందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ నుండి ఈ ప్రాంతం అస్తవ్యస్తంగా, అవిచ్ఛిన్నంగా విడదీయబడి అభివృద్ధికి నోచుకోక తల్లడిల్లుతుందని, అలాగే ఈ ప్రాంతంపై పాలకుల వివక్ష పటిష్టంగా కనిపిస్తుందని వారు తెలియజేశారు. మద్దూరు దూల్మెట్ట మండలాలను హుస్నాబాద్ రెవిన్యూ పరిధిలో కలిపి అలాగే చేర్యాల కొమరవెల్లి మండలాలను సిద్దిపేట రెవిన్యూ లో కలిపి ఆగం చేశారని, ఇక్కడి ప్రజలను అవిచ్ఛిన్నంగా విడదీసి ప్రాంత ఉనికిని ప్రశ్నార్ధకంగా చేశారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆత్మగౌరవం అస్తిత్వం కోసం జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వం స్పందించే విధంగా ఉద్యమం చేయాలని అందులో భాగంగానే నేటి విద్యాసంస్థల బందును జయప్రదం చేయగలరని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కో- కన్వీనర్ గోనపల్లి రమేష్ నాయకులు సాంబయ్య నరసింహులు అనిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *