రాజకీయం

పోలింగ్ కు పటిష్టమైన బందోబస్త్

279 Views

సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3052 సివిల్ అధికారులు సిబ్బంది, 16 కంపెనీ ల కేంద్ర బలగాలు, 1150 ఇతర రాష్ట్రాల సిబ్బంది తో ఎన్నికల నిర్వహణ.

భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఉన్న 06 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ అధికారులు, పోలీసు రూట్ మొబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ అధికారులను, పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్ లకు పటిష్టమైన భద్రతతో తీసుకువెళ్లడం జరుగుతుంది.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గం ఏన్టీపీసీ , జ్యోతి నగర్ , రామగుండం, మంథని నియోజకవర్గం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , మంథని , పన్నూర్, రామగిరి మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను మరియు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంచిర్యాల.

మంచిర్యాల జిల్లాలో

1762 మంది అధికారులు, సిబ్బంది
10 కేంద్ర బలగాల కంపెనీలు
650 మంది చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన హోం గార్డ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక పోలీస్ టీమ్లను పోలింగ్ బందోబస్త్ కు వినయోగించడం జరుగుతుంది అన్నారు.

పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం ఎన్నికల నిర్వహణకు 24*7 మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
16 కేంద్ర బలగాల సిబ్బందికి ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన పోలీసులకు జూ మీటింగ్ నిర్వహించి పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు వారి యొక్క బాధ్యతలు, డ్యూటీ లపై బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది.

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో 48 గంటల పాటు సైలెన్స్ పిరియడ్ లో అన్ని లాడ్జిలు, ఫంక్షన్ హల్ లో, గెస్ట్ హౌస్ లను చెక్ చేసి ఇక్కడ ఓటు హక్కు లేకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తులను బయటకు పంపడం జరుగుతుంది. ఆకస్మికంగా వాహన తనిఖీ ల నిర్వహణ ఓటర్లను ప్రభావితం చేసే ప్రజల ను ప్రలోబాలకు గురి చేసే డబ్బులు, వస్తువులు పంచకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఎన్నికలు సందర్బంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పెద్దపల్లి జిల్లాలో పూర్తి స్థాయిలోనీ 023-రామగుండం, 025-పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గలలో మరియు పాక్షిక స్థాయిలోనీ 022 -ధర్మపురి నియోజకవర్గంలోతేది నవంబర్ 28 సాయంత్రం 5:00 గంటల నుండి తేదీ నవంబర్ 30 సాయంత్రం 5:00 గంటల వరకు, పాక్షిక స్థాయిలోనీ 024-మంథని నియోజకవర్గ పరిధిలో తేదీ నవంబర్ 28 సాయంత్రం 4:00 గంటల నుండి తేదీ నవంబర్ 30 సాయంత్రం 4:00 గంటల* వరకు వరకు, *మంచిర్యాల జిల్లాలో పూర్తి స్థాయిలోని 002-చెన్నూరు, 003-బెల్లంపల్లి, 004-మంచిర్యాల మరియు పాక్షిక స్థాయిలోని సిర్పూర్ నియోజకవర్గలలో తేది నవంబర్ 28 సాయంత్రం 4:00 గంటల నుండి తేదీ నవంబర్ 30 సాయంత్రం 4:00 గంటల వరకు, (పాక్షిక స్థాయిలోని 006-ఖానాపూర్ నియోజకవర్గం లోని) జన్నారం మండలం ప్రాంతంలో నవంబర్ 28 సాయంత్రం 5:00 గంటల నుండి తేదీ నవంబర్ 30 సాయంత్రం 5:00 గంటల వరకు 144 సెక్షన్‌ అమలు చేయడం జరుగుతుంది.

మంచిర్యాల జిల్లా పరిధిలో -1989 వ్యక్తులను బైండొవర్
పెద్దపల్లి జిల్లాలో 2231 వ్యక్తుల బైండొవర్ చేయడం జరిగింది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్ లోకేషన్లలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. సరిహద్దు రాష్ట్రాల ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

ఎన్నికల ప్రవర్తన నియమావళి నియమ నిబంధనలు ఉల్లంఘించిన, ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించిన, అల్లర్లకు గొడవలకు పాల్పడిన వారిపై చట్టపరమైన ఘటన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *