జీవన్ ఉత్సవ్ ఎల్ఐసి పాలసీ ఆవిష్కరణ
సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలకు సరిపోయే “జీవన్ ఉత్సవ్” పాలసీ ద్వారా బీమా రక్షణ పొందాలని మంచిర్యాల ఎల్ఐసి సంస్థ చీఫ్ మేనేజర్ వి. విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు.
మంచిర్యాల ఎల్ఐసి ఆఫీసు ఆవరణలో బుధవారం రోజున జీవన్ ఉత్సవ్ నూతన పాలసీ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. గత 67 సంవత్సరాలుగా దేశ ప్రజలకు ఆర్ధిక రక్షణ అందిస్తున్న పబ్లిక్ రంగ ఎల్ఐసి సంస్థ ప్రవేశపెడుతున్న పథకాలతో దేశ ప్రజలకు ఆర్థిక లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు.
తాజాగా ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ ఉత్సవ్ పాలసీ గ్యారెంటీడ్ ప్రయోజనాలతో ప్రజలకు పలు విధాలుగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.ఈ సందర్భంగా కొత్త పాలసీ ప్రచార ప్రతులను అధికారులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ భారతి, పద్మావతి, ఫణి రామ్మోహన్, అనోజ్ కుమార్, రమేష్ బాబు, శివరంజన్, పోచయ్య, గోపికృష్ణ, రాజేశం, రామదాసు, మల్లారెడ్డి సిబ్బంది ఏజెంట్లు పాల్గొన్నారు.
