ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలింగ్ సిబ్బంది దే నని సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ అన్నారు.
బుధవారం సిరిసిల్ల నియోజకవర్గం కు సంబంధించి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో , వేములవాడ నియోజకవర్గం కు సంబంధించి వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్, ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి లు పరిశీలించారు.
ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ…. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ ను నిర్వహించాలనీ చెప్పారు. ఉదయం 05.00 గంటలకే మాక్ పోలింగ్ చేపట్టాలన్నారు. ఉదయం 07.00 గంటలకు వాస్తవ పోలింగ్ ప్రారంభించాలని చెప్పారు.
