అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చెన్నూరు నియోజకవర్గం మందమర్రి రామకృష్ణాపూర్ ఏరియాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ ఎన్నికల ప్రచారం చేశారు.
తర్వాత అతను మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
