ఏజెన్సీలో పర్యటించనున్న రామన్న
కేటీఆర్ రోడ్ షో విజయ వంతం చేయండి
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు
ఏటూరునాగారం
,నవంబర్ 26
ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతం ఏ టూర్ నాగారంలో సోమవారం బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి రమన్న పర్యటించ నున్నారు.కేటీఆర్ పర్యటన రోడ్డు షో ని ప్రజలు పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు కోరారు. మండల కేంద్రంలోని బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్థానిక విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం కెసిఆర్ బహిరంగ సభను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల సమస్యలు ప్రజలకు అవసరమున్న పనులు చేయడం గిరిజనుల కు పూడు హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది గిరిజ నేతల్లో కూడా అక్కుపత్రాలు ఇవ్వడం కోసం కృషి చేస్తు న్నామని అన్నారు.ఎన్నికలు ముగిసే వరకు జ్యోతక్క గెలుపు కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. మన ఏడున్నర ప్రాంతానికి కేటీఆర్ రాకతో ఈ ప్రాంతం భవిష్య త్తులో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్,రైతు సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్ల బుచ్చయ్య, సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,చిట్టిబాబు, మహేష్,వాలి బాబా,కోట నరసింహులు,తదితరులు పాల్గొన్నారు.




