రాజకీయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం

280 Views

తెలంగాణ లో కాంగ్రేస్ పార్టీ  పవనాలు వీస్తున్నాయని అధికారంలోకి రావడం కేసీఆర్ ఓడిపోవడం తథ్యమని కర్ణాటక సివిల్ సప్లయ్ శాఖ మంత్రి మునియప్పన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం మంచిర్యాల వచ్చారు. ఈసందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. కర్ణాటక తరహాలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. మహిళలకు రిజర్వేన్లు అమలు చేయాలని దివంగత రాజీవ్ గాంధీ ఎంతో ఆశించారని తెలిపారు.

రిజర్వేషన్ల తో సురేఖ, ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ కాంగ్రెస్ కు ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు.
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వాడ వాడల క్లబ్బులు పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయి మరిచి తనపై విమర్శలు చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. హైదరాబాదులో కేసీఆర్ హయాంలో క్లబ్బులు ఎలా నడుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తాను టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్లబ్బు మూసివేసినట్లు తెలిపారు.

రైతుబందు ఓ చేత ఇస్తూనే మరో చేత ధాన్యం తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తుందని ఆయన ద్వజమెత్తారు. రైతులు ప్రభుత్వ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్కు మంచి స్పందన ఉందని అన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఆమోదయోగ్యమైన పథకాలను అమలు చేసి తీరుతుందని అన్నారు. ఈసమావేశంలో కర్ణాటక ఎమ్మెల్యేలు దేవేందర్, శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *